సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన దక్షణ ఎమ్మెల్యే శ్రీనివాస్

విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్)

సీతంపేట ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్సలకు ఆర్థిక సహాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న ఏడుగురు లబ్ధిదారులకు ముఖ్య మంత్రి వారు, సదరు కుటుంబాల వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తము చెక్కుల ద్వారా ఆర్ధిక సహాయము అందజేశారు. సదరు చెక్కులను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ చేతులమీదుగా లబ్దిదారులకు చెక్కులు అందజేశారు.

సీఎం రిలీఫ్ ఫండ్ పొందిన లబ్దిదారుల వివరాలు:

1) 29 వార్డుకు చెందిన ఉప్పాడ లక్ష్మి కి రూ, 35,000/-,
2) 29 వార్డుకు చెందిన ముద్ద సత్యవతి కి రూ, రూ,28,400/-,
3) 33 వార్డుకు చెందిన శ్రీరామ్ సత్యవతి కి రూ, 55,000/-,
4) 35 వార్డుకి చెందిన పత్తిగుళ్ల దుర్గ సంధ్యారాణి కి రూ, 50,786/-
5) 35 వార్డుకి చెందిన పెదపల్లి సూర్యం కి రూ, 1,27,558/-
6) 36 వార్డుకి చెందిన పైలా అర్జునరావు కి రూ, 60,000/-,
7) 36 వార్డుకి చెందిన కడితి సూర్యకాంతం కి రూ, 50,000/-.

ఈ కార్యక్రమం లో లబ్ధిదారుల తో పాటు ఆయా వార్డులకు చెందిన కూటమి వార్డ్ కార్పొరేటర్, వార్డ్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతం జనవాణి కార్యక్రమంలో వివిధ వార్డుల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు వెంటనే పరిష్కరించగా మిగిలిన సమస్యలను సంబంధిత అధికారులకు తెలియపరిచారు. కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link