స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయంప్రతిపత్తి కళాశాల పాలకొల్లులో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ముందుగా డా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరంజరిగిన సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.రాజరాజేశ్వరి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని,ఉన్నత విలువలతో కూడిన,పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చిన ఆదర్శప్రాయుడైన డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవటం ఆనందంగా ఉందన్నారు.ప్రతి వ్యక్తి తాను ఎదగటానికి తోడ్పడిన తన జీవితంలో ఉన్నతస్ధాయికి చేరటానికి మార్గనిర్దేశం చేసిన గురువును మర్చిపోకూడదన్నారు.గురువు శిష్యులను తమ కన్నబిడ్డలకంటే ఎక్కువ ఆదరణ, ప్రేమను అందించి వారు ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి తాను నిచ్చెనమెట్లుగా మారతారన్నారు.అటువంటి ఉపాధ్యాయులను గౌరవిస్తూ విద్యార్ధులే ముందుడి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు చేయటం వారికి గురువులు పట్ల ఉన్న భక్తితత్పరత అర్ధమౌతుందన్నారు.అనంతరం విద్యార్ధినీ విద్యార్ధులు ఉపాధ్యాయులందరినీ ఘనంగా సన్మానించి సత్కరించి ఆశ్శీస్సులు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి కృష్ణ, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ యామిని, ఐ క్యు ఏ సి కొఆర్డినేటర్ భద్రాచలం, తెలుగు విభాగాధిపతి డా బూసి వెంకటస్వామి,జంతుశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం రామకృష్ణ, అర్దశాస్త్ర విభాగాధిపతి డా సిహెచ్ ఉషారాణి, అధ్యాపకులు వంశీ సుబ్బరాయన్ ,పి శ్రీనివాసరావు, డా.వి.విజయలక్ష్మి, జి.డి.శ్రీనివాసరావు, రవికుమార్, రమేష్ బాబు, శివకృష్ణ, మన్మధరావు, పార్ధసారధి, శ్రీదేవి,ఆశాజ్యోతి,దుర్గేశ్వరి,స్వర్ణలత, మహేష్, రోహిత్, యం శిరీష, జ్యోష్న, హెప్సిబా, రామలక్ష్మి, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


