ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్ష్యరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి చేపట్టిన అక్షర ఆంధ్ర ఉల్లాస్ మండల స్థాయి శిక్షణా కార్యక్రమం ఉండ్రాజవరం వెలుగు భవనంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మండల తహసీల్దార్ పి.ఎన్.డి. ప్రసాద్, మండల అభివృద్ధి అధికారి వెంకట రామారావు హాజరయ్యారు. అతిధులు మాట్లాడుతూ మండలంలో 9000 మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని మొదటవిడతగా 2200 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దెందుకు 220 మంది వాలంటీర్ లని నియమించి ప్రతీ వాలంటీర్ కు పదిమంది నిరక్షరాస్యులను కేటాయించి వారికి శిక్షణ ఇవ్వడం జరుగుతోందని, అదేవిదంగా విద్య ఆవశ్యకతను తెలిపారు. ఈ ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చదువేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ టి. బాలకోటయ్య, మండల విద్యాశాఖధికారి శారదాజ్యోత్స్న రిసోర్స్ పర్సన్ గా ఎల్.ఎన్.వి.బి.ఆర్.ఎల్. మూర్తి పాల్గొన్నారు.


