చిరంజీవిని ఆదర్శంగా తీసుకుకోవాలని సూచన
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి – తణుకులో చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే
‘మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్’ ఆధ్వర్యంలో అభిమానులు చేపట్టిన సేవాకార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. శ్రీరామ నవమి పురస్కరించుకుని తణుకు జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో తణుకు టౌన్ అండ్ తాలూకా వైడ్ మెగాస్టార్ చిరంజీవి, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్ అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఇలాగే చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని సేవా కార్యక్రమాలు,రక్తదానం వంటి కార్యక్రమాలు కొనసాగించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మండు వేసవిలో సమాన్యుల దాçహార్తిని తీర్చే విధంగా చలివేంద్రాన్ని అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మెగాస్టార్ చిరంజీవి పిలుపు మేరకు ఆయన అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటూ అనేక మందికి అండగా ఉంటారని అన్నారు. అందులో భాగంగానే చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చే విధంగా కృషి చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ అభిమానులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


