రాష్ట్ర బిజెపి నాయకురాలు, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక వ్యక్తిగత కార్యాలయము నందు జరిగిన స్వతంత్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగును నింపేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు బాబూ జగజ్జీవన్ రాం అనిఅన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు కొడమంచిలి జితేంద్ర, దళిత నాయకులు ఆకుమర్తి రెడ్డియ్య, తలపాకుల సుబ్బారావు, సిర్ర రమణ, జొన్నాడ సత్యనారాయణ, కొమ్మర నాని, చర్మకారుల సంఘం పట్టణఅధ్యక్షుడు మెరుపే వేంకటేశ్వరరావు తదితరులు పాల్గొనీ ఘనంగా నివాులర్పించారు.


