శ్రీరామ చంద్రుని కల్యాణ మహోత్సవాలు – హాజరైన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ
తణుకు నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో వాడవాడలా శ్రీరామనవమి వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తణుకు పట్టణంతోపాటు తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లోని ఆయా గ్రామాల్లో రామాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాల్లో చలువ పందిళ్లు మధ్య నిర్వహించిన కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగాయి. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని దేవాలయాలను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగదభి రాముడి దయతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, రామరాజ్యం లాంటి కూటమి ప్రభుత్వ పాలనలో మన రాష్ట్రం మరింత పురోగతి సాధించాలని స్వామివారికి కోరుకున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. తణుకు పట్టణంలోని 11వ వార్డు, 10వ వార్డు, 22వ వార్డులతోపాటు తణుకు ఎన్జీవో హోం, పైడిపర్రు, సావరం ఆంజనేయస్వామి ఆలయం, అత్తిలి మండలం అత్తిలి, తణుకు మండలం గోపాలపురం, వేల్పూరు గ్రామంలోని మొత్తం 3 దేవాలయాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


