శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం తణుకు మండలం దువ్వ గ్రామంలో రాష్ట్ర బిజెపి నాయకురాలు, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక సీతారామచంద్రుల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీతారాముల అన్యోన్యమైన దాంపత్యం, లక్ష్మణుని నిస్వార్థమైన సహకారం, భరతుని నిష్కళంకమైన ప్రేమ, హనుమంతుని అచంచలమైన భక్తి, దశరథరాముల మధ్య కనిపించే తండ్రీకుమారుల ప్రేమ మనందరికీ ఆదర్శం కావాలి అని అన్నారు.
ఆ దివ్యమైన బంధాలు మన అందరి జీవితాలలోనూ ప్రతిఫలించాలని ఆదివారం దువ్వ గ్రామంలో హరిజనవాడ
శ్రీ కోదండ రామాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవంలో పాల్గొని స్వామివారికి
నూతనవస్త్రములు సమర్పించి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి,
ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,
సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


