ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గా ఎన్నికయిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యవర్గసభ్యులు సోము వీర్రాజుని మంగళవారం రాజమండ్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తణుకు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, బీజేపీ రాష్ట్ర నాయకురాలు ముళ్ళపూడి రేణుక సోము వీర్రాజు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం పట్ల శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రాష్త్రంలో కూటమి ప్రభుత్వపనితీరు, బిజేపి శ్రేణుల పనితీరుపై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


