కరెంట్ ఛార్జిలు తగ్గించాలి – ఇంటింటికి సిపిఎం స్టిక్కర్ క్యాంపెయిన్
రాజమహేంద్రవరం : మా ఇంటికి ప్రి పెయిడ్ స్మార్ట్ మీటర్ వద్దు అంటూ, కరెంట్ ఛార్జిలు తగ్గించాలని ఇంటింటికి సిపిఎం పార్టీ ప్రచార క్యాంపెయిన్ నిర్వహిస్తుందని జిల్లా కార్యదర్శి టి. అరుణ్ ప్రకటించారు. ఈ సందర్బంగా అరుణ్ మాట్లాడుతూ గత YCP ప్రభుత్వంలో 8 సార్లు విద్యుత్ ఛార్జిలను పెంచి ప్రజలపై భారమోపారని గుర్తుచేశారు. అప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాదుడే బాధుడు అనే కార్యక్రమంతో వ్యతిరేకించారని, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి అయినా ప్రజలపై సర్దుబాటు ఛార్జిల బారాన్ని బాదుడే బాధుడు ను కొనసాగిస్తూన్నారని విమర్శించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి ప్రభుత్వం మరల అదనంగా ఆదానితో చేసుకున్న స్మార్ట్ మీటర్ ల ఒప్పందంను అమలు చెయ్యడం వల్ల ప్రజలపై మరో పిడుగు వేస్తున్నారని అన్నారు. ఈ ప్రీ – పెయిడ్ స్మార్ట్ మీటర్ ధర సుమారు 12 వేల రూపాయల బారాన్ని కూడా ప్రజలపై మోపుతున్నారని తెలిపారు. ఈ స్మార్ట్ మీటర్ బిగించడం వల్ల టైం ఆఫ్ డే విధానం అమలు చేసి ప్రజలు ఎక్కువ విద్యుత్ ఉపయోగించే సమయంలో యూనిట్స్ కు అదనంగా ఛార్జిలు వసూల్ చెయ్యనున్నారని తెలిపారు. ఈ విధానం ప్రజలకు మరింత విద్యుత్ భారం కానున్నదని, దీనిని అమలు చెయ్యకూడదని డిమాండ్ చేసారు. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం నాయకుడు లోకేష్ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ ను ఎవరి ఇంటికి ఐనా బిజిస్తే పగలగొట్టమని పిలుపునిచ్చారని ఇప్పుడే లోకేష్ గారు ప్రజలు మీటర్లు పగల గొట్టలా ఉంచాలా అని ప్రశ్నించారు. ఆదానితో జగన్ ప్రభుత్వం చేసుకున్న అవినీతి ఒప్పందాన్ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేసారు. అమెరికా అంతర్జాతీయ న్యాయస్థానంలో అవినీతి కేసు నమోదు చేసిన దీనిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడక పోవడం, ఒప్పందాన్ని కొనసాగించడం దుర్మార్గం అన్నారు. సేకి తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసి ప్రజలపై విద్యుత్ భారలు ఉపశమహరించాలని కోరారు. ఏప్రిల్ నెల మొత్తం ఇంటింటికి తిరిగి స్మార్ట్ మీటర్ లు పెట్టవద్దని, విద్యుత్ ఛార్జిలు తగ్గించాలని స్టిక్కర్ ను ఇంటింటికి అతికించి రాష్ట్ర ప్రభుత్వంకు ప్రజలు నిరసన తెలపాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జువ్వల. రాంబాబు, బి.పవన్, జిల్లా కమిటీ సభ్యులు ఎం. సుందర్ బాబు, ఐ. సుబ్రహ్మణ్యం, నాయకులు అశోక్, రాజేష్, భాస్కర్ తదితరులు పాల్గున్నారు.


