విశాఖలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్(ఏపీజేయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షులు, ఉపకార్ ట్రస్టు చైర్మన్ డా.కంచర్ల అచ్యుతరావు జర్నలిస్టుల కుటుంబాల కష్టాల్లోనూ ఇతోదికంగా పాలు పంచుకుంటున్నారు. విశాఖలో ఒక న్యూస్ ఛానల్ లో కెమెరామాన్ గా పనిచేస్తున్న చుక్కల విజయ్ కుమార్ తండ్రి, చుక్కల ఆంతోని మృతిచెందడంతో ఆ కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం రూ.20వేలు ఆర్ధిక సహాయం చేశారు. అనునిత్యం సేవా కార్యక్రమాల్లో ముందుంటే డా.కంచర్ల అచ్యుతరావు జర్నలిస్టులు, కళాకారులు, సినిమా వర్గాలకు చెందిన వారి కుటుంబాల్లో ఎవరు కాలం చేసినా మట్టి ఖర్చుల క్రింద రూ.10వేలు ఆర్ధిక సహాయం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే జర్నలిస్టు తండ్రి పరమపదించడంతో తనవంతు సహాయంగా ఈ మొత్తాన్ని అందించి ఆర్ధిక చేయూత నందించారు. దీనితో జర్నలిస్టుల కుటుంబాలకు పెద్దదిక్కుగా ఉంటూ తమ వెన్నుదన్నుగా నిలబడుతున్నారని కెమెరామేన్ విజయ్ కుమార్ ధన్యవాదములు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏపీజేయూ గౌరవాధ్యక్షులు డా. కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ, తనకు మీడియా అంటే ఆరోప్రాణమని తన పెద్ద కుటుంబమని అలాంటి కుటుంబంలో ఏ ఒక్కరికి ఆపదన్నా ఆదుకోవడానికి తాను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటానని పేర్కొన్నారు. ఏ ఒక్క జర్నలిస్టుకి కష్టం వచ్చినా సదరు కుటుంబాల్లోని వారు కాలం చేసిన సమయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. తాను ఇచ్చిన మాట మేరకు జర్నలిస్టులకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు సిద్దంగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆది నుంచి జర్నలిస్టుల పక్షపాతిగా నిలుస్తూ రాష్ట్రంలోనే అత్యధిక మొత్తంలో వర్కింగ్ జర్నలిస్టులు, మీడియాలో పనిచేసే జర్నలిస్టులకు ఆర్దిక సహాయం చేస్తున్న డా.కంచర్లపై మీడియా, కళాకారుల నుంచి పెద్ద మొత్తంలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.


