నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు రూరల్ మండలం, పురుషోత్తపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కార్మికుడు దేశభక్తుల నరేష్ అరటితోటలో కలుపు మందు స్ప్రే చేస్తుండగా ప్రమాదవశాత్తు తెగిపడిన విద్యుత్ వైర్లు తాకడంతో విద్యుత్ ఘాతుకంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హుటా హుటిన సంఘటనలో మృతదేహాన్ని ప్రభుత్వఆసుపత్రి వద్ద సందర్శించి, అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా నిడదవోలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి నుండి వచ్చే ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సంబందిత శాఖాధికారులను ఆదేశించారు.


