అసిస్టంట్ గవర్నమెంట్ అడ్వకేట్ ( AGP ) గా తణుకు కోర్టు కు గాజుల వీర వెంకట అప్పాజీ(అప్పాజీ )ని నియమిస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం ఇచ్చినట్లు అప్పిజి తెలిపారు. అప్పాజీ 2005 సం., నుండి న్యాయవాదిగా తణుకు కోర్ట్స్ లో వృత్తి నీ చేస్తున్నారని తెలిపారు.ఈయన ప్రభుత్వం తరఫు కేసులను వాదిస్తారు. తణుకు నియోజకవర్గము, నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం, పెరవలి పరిధిలోని ప్రభుత్వ కేసులను అప్పాజీ వాదిస్తారు తెలిపారు. ఈయన నియమము పట్ల తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు.


