నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన విశాఖ 41 వార్డ్ టీడీపీ అధ్యక్షులు ఐతి మధుబాబు
విశాఖపట్నం: జ్ఞానాపురం: (కోస్టల్ న్యూస్)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా ఈరోజు 41వార్డు సచివాలయం బూత్ నెంబర్ 18,19 పరిధిలో 41 వార్డ్ టీడీపీ అధ్యక్షులు ఐతి మధుబాబు స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమoత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ పరంగా మరింత ముందుకు వెళుతుందని అందులో భాగంగా ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1.45 కోట్ల రేషన్ కార్డులను క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డులుగా అప్గ్రేడ్ చేసిందనీ, QR కోడ్ ను స్కాన్ చేసి కుటుంబ వివరాలు, వస్తువుల హక్కులు, రేషన్ చరిత్ర చూడవచ్చునని, ఈ స్మార్ట్ రేషన్ కార్డుల వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించడానికి మరింత సులువుగా ఉంటుందని అలాగే వృద్ధులు, దివ్యాంగులుకు అవసరమైన రేషన్ సరుకులు ఇంటి వద్దకే డెలివరీ ఇవ్వడం జరుగుతుందని, స్మార్ట్ రేషన్ కార్డులపై కుటుంబ యజమాని ఫొటో మాత్రమే ముద్రణ అయి ఉంటుందని ఏ ఇతర రాజకీయ నాయకుల ఫొటోలు లేకుండా నిష్పక్షపాతంగా కూటమి ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డును రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు, సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


