అధికారులతో కలిసి రోజంతా వార్డులోనే పర్యటనలో ఉన్న గంకల
విశాఖపట్నం: (కోస్టల్ న్యూస్)
జీవీఎంసీ 48వ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను 48వ వార్డు కార్పొరేటర్, బిజెపి ఫోర్ లీడర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ గంకల కవిత అప్పారావు యాదవ్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. వార్డులో గల మినీ ఫంక్షన్ హాల్ లేక పేద ప్రజలు శుభకార్యాలకు ఇబ్బందులు పడుతున్నారని, కాలువలు, డ్రైనేజీలు మరమ్మతులు గురై వార్డు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గంకల కవిత అప్పారావు యాదవ్ చేపట్టిన గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు మేరకు జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించి నిర్మాణాలు చేపతున్నామని గంకల పేర్కొన్నారు. ఈ సందర్బంగా బాపూజీనగర్ లో నిర్మాణం చేపడుతున్న మినీ ఫంక్షన్ హాల్ పనులను, పోలీస్ లైన్ శ్రీనివాస్ నగర్ కాలువలు నిర్మాణ పనులను నేరుగా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా గంకల కవిత అప్పారావు యాదవ్ మాట్లాడుతూ కొండవాలు ప్రాంతంలో గల ప్రజలు శుభకార్యాలు చేసుకునేందుకు ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గుడ్ మార్నింగ్ గంకల కార్యక్రమంలో వినతి పత్రాలు అందజేశారని, పోలీస్ లైన్ శ్రీనివాస్ నగర్ లో కాలువలు మరమ్మతులకు గురి అయ్యిందని, నూతన కాలువలు నిర్మాణం చేయాలనీ కోరడంతో వార్డులో పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా శాశ్వతంగా మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం, పోలీస్ లైన్ శ్రీనివాస్ నగర్ కాలువలు నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అతిత్వరలో వార్డులో మినీ ఫంక్షన్ హాల్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేరుగా వార్డులో పర్యటన చేసి వార్డు అభివృద్ధికి నిరంతరం కట్టుబడి ఉన్నామని గంకల తెలిపారు. వార్డు ప్రజలకు ఏ సమస్య ఏర్పడిన తక్షణమే తనను సంప్రదించాలని గంకల పేర్కొన్నారు. వార్డు ప్రజల కోరిక మేరకు జీవీఎంసీ కౌన్సిల్లో చర్చించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్న గంకల కవిత అప్పారావు యాదవ్ కు బాపూజీ నగర్, పోలీస్ లైన్ శ్రీనివాస్ నగర్ ప్రజలు అభినందనలు తెలిపారు.


