స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ
విశాఖపట్నం: దక్షిణ: ఆగష్టు (కోస్టల్ న్యూస్)
దక్షిణనియోజకవర్గం శాసన సభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 33వార్డు పరిధిలో 1కోటి 44లక్షల జీవీఎంసీ నిధులతో అస్సాం గార్డెన్స్, నీలమ్మ వేపచెట్టు వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న మేయర్ పీలా శ్రీనివాస్, స్థానిక జివిఎంసి ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ వసంత లక్ష్మిజీకే పాల్గొన్నారు. 33వార్డ్ పరిధిలో లీలా మహల్ జంక్షన్ నుండి నీలమ్మవేపచెట్టు ఇందిర గాంధి జంక్షన్ వరకు 46.66 లక్షల తో బీటి రోడ్డు పనులు అల్లిపురం జంక్షన్ నుండి కెప్టెన్ రామారావు జంక్షన్ వరకు 48.3 లక్షలతో సిసి డ్రైయిన్ పనులు లీలా మహల్ జంక్షన్ నుండి సౌత్ జైలు రోడ్డు వరకు 49.5 లక్షలతో డ్రెయిన్ నిర్మాణం పనులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో దాదాపుగా రోడ్లు ,డ్రైనేజీకి సంబంధించిన పనులు పూర్తి చేసామని ఇంకా ఏమైనా పనులు మిగిలి ఉంటే మరి కొద్ది రోజులలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు కూటమి ప్రభుత్వం ప్రజాపాలనకు అనుగుణంగా నడుచుకుంటుందని ప్రజా సమస్యలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు. నిరంతరం నియోజవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమ పాలన కు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు
కార్యక్రమంలో మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్,కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి, జోన్ 4 కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు,నాయకులు డాక్టర్ గోపికృష్ణ, డాక్టర్ విళ్లూరి చక్రవర్తి, శ్రీసత్యనారాయణ ఈఈ, డిఈ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


