మద్యం కేసులో మాజీమంత్రి కారుమూరి అరెస్ట్ చేసిన ఈ.డి. :

లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఆదివారం ఈడీ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ కొండాపూర్‌లోని నివాసంలో కారుమూరి అరెస్ట్ చేసి, బషీర్ బాగ్ ఈడీ కార్యాలయానికి తరలించారు.
మాజీ పౌరసరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్ అరెస్ట్ అయిన తరువాత మాజీ మంత్రి అరెస్ట్ కూద తప్పదని అనుకున్న తరుణంలో తణుకు నియోజకవర్గ రాజకీయాల్లో ఈ అరెస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ హయాంలో ఏపీ లిక్కర్ రవాణాలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తింపు. కాంట్రాక్టుల ద్వారా రూ.28 కోట్ల వరకు ముడుపులు తీసుకున్నట్లు ఈడీ గుర్తింపు.
కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.195.33 కోట్ల నష్టం వాటిల్లినట్లు గుర్తింపు
సిగ్మా, సుదర్శన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలకు మద్యం రవాణాలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ని సోమవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఈడీ కోర్టులో ఆయనను హాజరుపరచనున్నారు.

Scroll to Top
Share via
Copy link