మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఇరగవరం నందు 2025-26 ఆర్ధిక సంవత్సరమునకు సంబంధించిన స్వచ్చ భారత్ మిషన్ శిక్షణా తరగతులు గురువారం మొదలయ్యాయి. ఈ శిక్షణలో బహిరంగ మలవిసర్జన నిర్మూలన ను 100% సాధించడం, వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు వినియోగం వంటి అంశాలపై మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సదరు శిక్షణా కార్యక్రమము లో పంచాయతీ అభివృద్ధి అధికారులు బహిరంగ మలవిసర్జన నిర్మూలన 100% సాధించడం, వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు వినియోగం పై ప్రజల్లో అవగాహన కల్పించడం, సంబంధిత నిబంధనలు మరియు చట్టాల అమలుపై క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసే విధానాలపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ.శ్రీనివాస్ శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండలంలో పంచాయతీ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది హాజరయ్యారు.



