ఇరగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గోటేరు గ్రామంలో జడ్ జడ్.పి.హైస్కూల్ వద్ద “డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం” అవగాహన కార్యక్రమాన్ని ను సబ్ యూనిట్ ఆఫీసర్ జి. వెంకటేశ్వరరావు పరిశీలించి అనంతరం మాట్లాడుతూ “వర్షాకాలం నేపథ్యంలో కాలానుగుణ వ్యాధులలో భాగంగా మలేరియా, డెంగ్యూ వ్యాధులబారిన పడకుండా ఉండాలంటే ప్రతి రోజూ డ్రైడే గా పాటించడం ప్రతి ఒక్కరూ ప్రాథమిక భాధ్యతగా గుర్తించి ఆచరించాలని, కాచి చల్లార్చిన నీటిని త్రాగడం, చేతుల శుభ్రత పాటించడం, ఆహార పదార్థాలు ఉన్న వాటిపై మూతలు ఉండడం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తినకుండా ఉండడం ద్వారా టైఫాయిడ్,అతిసారం, జాండిస్ మొదలగు వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వివరించి, ఆరోగ్య సమాజం తోనే అభివృద్ధి సాధ్యమని, ఆరోగ్యం కూడా సంపదతో సమానమని ఉద్బోధించారు.ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ సి.హెచ్.భాను ప్రకాష్,హెల్త్ సూపర్వైజర్ బి.మూర్తి, ఉప ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సి.హెచ్.ఓ కె.ఇంద్రాణి, ఎ.ఎన్.ఎమ్ డి.పద్మ కుమారి, ఆశా కార్యకర్త వి.చంద్ర లక్ష్మి పాల్గొన్నారు.



