పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
తణుకులో మొక్కలు నాటిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఇంధన పొదుపు పాటించాలని ఎమ్మెల్యే పిలుపు
మున్సిపల్ సిబ్బందికి సైకిళ్ళు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి పర్యావరణం మాత్రమే అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తణుకులోని పలు ప్రాంతాల్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గాలి, నీరు, నేలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో మార్పులు చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన నా దేశం నా బాధ్యత పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ భగస్వాములు కావాలని కోరారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఎండ వద్ద ఒక్కో మొక్కను నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యతను తీసుకోవాలని సూచించారు. వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయని ముఖ్యంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వర్షాకాలంలో అధిక వర్షాలు, వరదలు, తుఫానులు వాతావరణంలో వస్తున్న మార్పులకు సంకేతాలు అని అన్నారు. వాతావరణ సమతుల్యం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో ప్రతి ఒక్కరూ ఇంధనం పొదుపు పాటించాలని కోరారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ప్రతి శుక్రవారం ఇంధనం వాహనాలు వినియోగించకుండా కేవలం సైకిళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయ వాహనాలను మాత్రమే తమ విధులు నిర్వర్తించుకోవాలని కోరారు. అనంతరం ఇంధనం పొదుపులో భాగంగా మున్సిపల్ సిబ్బందికి సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



