తణుకు : జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా “అమ్మ పేరుతో ఒక మొక్క” కార్యక్రమాన్ని బీజేపీ తణుకు పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక 3వ వార్డు కరుటూరి చిన్న సుబ్బారాయుడు నగర్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక హాజరై మొక్కలు నాటారు.ఈ సందర్భంగా డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పులు మానవాళికి సవాళ్లుగా మారుతున్నాయని, వాటిని ఎదుర్కోవాలంటే మొక్కల పెంపకం తప్పనిసరి అని అన్నారు. ప్రతి కుటుంబం తమ తల్లి పేరుతో కనీసం ఒక మొక్కను నాటి సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని ఆమె వివరించారు. పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవచ్చని, యువత ముందుకు వచ్చి పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని సూచించారు.అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చ కార్యదర్శి యన్నమని శ్రీరామకృష్ణ, జిల్లా ఎస్సి మోర్చా ఉపాధ్యక్షులు కొడమంచిలి జితేంద్ర, జిల్లా ఐటి సెల్ కన్వినర్ గంటా శరత్, జిల్లా కార్యవర్గ సభ్యులు గంటా లక్ష్మి, బీజేపీ తణుకు పట్టణ ప్రధాన కార్యదర్శి కసిరెడ్డి మణిదీప్, మాజీ ప్రధాన కార్యదర్శి రాసాబత్తుల అనుకుమార్, మాణిక్యాలరావు, పట్టణ కిసాన్ మోర్చ అధ్యక్షులు పులమాల వీరభద్రం, పట్టణ యువ మోర్చ అధ్యక్షులు ఆకుల హరి, పట్టణ ఎస్సి మోర్చ అధ్యక్షులు చదలవాడ అమృతరావు, కరాసు శివప్రసాద్, చింతపల్లి రాజు, మురళి కృష్ణ, చింతపల్లి చంద్రకళ, జావ్వాది వీరభద్రయ్య, కాజ రమేష్, బలభద్ర ప్రకాష్, వల్లభుని సుబ్బారావు, కరుటూరి బద్రి నారాయణ, కరుటూరి వెంకట్రావు, సింహాద్రి సూర్యనారాయణ పార్టీ నాయకులు, కార్యకర్తలు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.



