తణుకులో శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వేసవి విజ్ఞాన తరగతులు

తణుకు, మే 30, 2026 : విద్యార్థినీ విద్యార్థులు వ్యాకరణం నేర్చుకోవడం ద్వారా తప్పులు లేని ఇంగ్లీషు వాక్యాలు వ్రాయడం, మాట్లాడడం చేయగలుగుతారని రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, మనస్తతత్వవేత్త, కోట రామ ప్రసాద్ విద్యార్థినీ విద్యార్థులకు హితవు పలికారు.

స్థానిక అమరవీరుల భవనంలో శ్రీశ్రీ సేవా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణా తరగతుల్లో భాగంగా, మూడవ రోజైన శనివారం నాడు జరిగిన కార్యక్రమంలో ఆంగ్ల భాష వ్యాకరణంపై కోట రామ ప్రసాద్ విద్యార్థినీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు.

ఈ శిక్షణా కార్యక్రమం సంస్థ ప్రధాన కార్యదర్శి పోపూరి దక్షిణా మూర్తి, దూబచర్లలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థ లో పనిజేసిన రిటైర్డ్ సీనియర్ అధ్యాపకులు వీరవల్లి రామ తిలక్, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఎలెక్ట్రికల్ ఇంజినీర్ అతికాల ప్రసాదరావు, బాలోత్సవం నిర్వహణ కమిటీ సభ్యురాలు శ్రీమతి యర్రా రాజ్యలక్ష్మి ల ఆధ్వర్యంలో జరిగింది.

తొలుత స్థానిక లక్ష్మీ చెస్ అకాడమీ చీఫ్ కోచ్ కుడిపూడి చరణ్, చెస్ ఆట ఆడే విధానాన్ని విద్యార్థినీ విద్యార్థులకు ప్రయోగాత్మకంగా వివరించారు.

తరువాత తణుకు జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయులు, యన్.సి.సి. నేవీ ట్రూప్ అధికారి సీహెచ్.రాజు విద్యార్థినీ విద్యార్దులకు గణిత శాస్త్రంలో గణిత సమస్యల సాధనలో ఉపయోగపడే మెళుకువలు, “ఒరిగామి” శాస్త్రంలో భాగమైన, పేపర్ తో వివిధ ఆకృతులు తయారు చేసి చూపించి, విద్యార్థినీ విద్యార్థులచే తయారు చేయించారు.

స్థానిక జిల్లా ప్రజా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ టీచర్ గా పనిజేస్తున్న చింతపల్లి దుర్గా ప్రసాద్ శిక్షణా శిబిరంలో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులకు చిత్రలేఖం, పెయింటింగ్ లో శిక్షణ ఇచ్చారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులకు చిత్రలేఖనం, పెయింటింగ్ లో పోటీ నిర్వహించారు.

వాతావరణం కొంచెం చల్లబడిన కారణంగా శిక్షణా శిబిరాన్ని మరొక రోజు పెంచినట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి పోపూరి దక్షిణా మూర్తి చెప్పారు. రేపు అనగా ఆదివారంతో శిక్షణా శిబిరం ముగుస్తుందని ఆయన చెప్పారు.

ఈ శిక్షణా శిబిరానికి హాజరైన విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, శిక్షణా శిబిరంలో పాల్గొన్న పెద్దలకు, బిస్కెట్లు, మంచినీటి బాటిల్స్, జామకాయలు నిర్వాహకుల పక్షాన శ్రీమతి యర్రా రాజ్యలక్ష్మి పంచిపెట్టారు.


✍️వార్త రచన & ఫోటోలు షేర్ చేసిన వారు : కోట రామ ప్రసాద్, రిటైర్డ్ ఆంగ్ల భాష అధ్యాపకులు, టీవీ & సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, పాలంగి గ్రామం & (P.O.) PIN : 534 216, తణుకు పట్టణం వద్ద, ఉండ్రాజవరం మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం. వాట్స్ ఆప్ నెంబర్ : 93475 03536, జియో ఫోన్ నెంబర్ : 89195 72779.

Scroll to Top
Share via
Copy link