తెలుగువారి ఆత్మగౌరవం నలుదిశలా చాటి చెప్పిన ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఉండ్రాజవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టిడిపి అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ ఆధ్వర్యంలో నిడదవోలు నియోజకవర్గం టిడిపి నాయకులు యువనేత గన్నమని వెంకట సుబ్రహ్మణ్యం ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి ఉన్నంతవరకు మరపురాని పేరు ఏదైనా ఉంది అంటే ఎన్టీఆర్ అని అన్నారు. సినీ నటుడిగా ఎన్నో పాత్రలను పోషించి ప్రజలను రంజింపచేసిన కళామతల్లి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ అని అన్నారు. పేద ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఎన్టీఆర్ రాజకీయం ద్వారానే పేదల జీవితాల్లో మార్పు తీసుకురాగలమని తెలుగుదేశం పార్టీని పెట్టారని అన్నారు. మండల టిడిపి అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం ఏర్పడిన నాటినుండి నేటివరకు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, అణగారిన వర్గాలను రాజకీయంగా పదవులలో కూర్చోబెట్టిన ఘనత తెలుగుదేశానికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జిలు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. మహానాడు వర్చువల్ సభల నిర్వహణలో భాగంగా ఉండ్రాజవరం సుధీంద్రబాబు ఆశ్రమంలో క్లస్టర్ 7 బూత్ లెవెల్ నాయకులకు కార్యకర్తలకు మహానాడు నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిడదవోలు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ బూరుగుపల్లి శేషారావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు ఒక దిశా నిర్దేశం చేసిన ఘనుడు ఎన్టీఆర్ అని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలో అఖండమైన మెజార్టీతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తెలుగు తేజం ఎన్టీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ 7 ఇన్చార్జ్ వెలిచేటి హరిచంద్ర ప్రసాద్, వెలగదుర్రు టిడిపి అధ్యక్షులు ముదునూరి రవీంద్రరాజు, తాడిపర్రు టిడిపి నాయకులు పెండ్యాల గోవిందు, వాకలపూడి సత్య నారాయణ, గారపాటి చిన్నారావు, మండల టిడిపి నాయకులు కుదప చక్రపాణి, ఆచంట వెంకటకృష్ణ, పాతూరి నరేంద్ర, బూరుగుపల్లి నారాయణ, సిరసపల్లి సత్తిబాబు, కోటిపల్లి సుబ్రహ్మణ్యం, కొర్లేపర సురేష్ ,టేకి లక్ష్మణరావు, యిర్రి సుబ్బారావు, వానపల్లి శ్రీనివాస్, పోలమాటి వెంకట నరసయ్య, కుంచే కాంతారావు, బొల్లిపో బున్ని, దారా యేసు వర ప్రసాద్, తలపాగల శ్రీనివాసు, అక్కశెట్టి రామలింగేశ్వర రావు, కోన జయ, టేకి వీరభద్రం, మాకిరెడ్డి రాందాసు, బొక్క చంద్రశేఖర్, నీరుళ్ళ వీరాస్వామి, ఈదా రూబేన్, పెనుమాల నాగేశ్వరరావు, గుమ్మడినిరంజన్ తదితరులు పాల్గొన్నారు.



