పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు ఇరగవరం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో బుధవారం “స్వచ్ఛపధం” కార్యక్రమము ద్వారా ప్రధాన రహదారులు మరియు ఇతర రహదారులు శుభ్రం చేయడం జరిగింది.
స్వచ్ఛ పధం కార్యక్రమములో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ శ్రీనివాసు గారు, గ్రామ ప్రత్యేక అధికారులు, పంచాయతీ అభివృద్ధి అధికారులు, స్వర్ణ గ్రామ కార్యాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు హాజరయ్యారు.
ఈరోజు మండల పరిషత్ కార్యాలయము ఇరగవరం నందు తణుకు మరియు ఇరగవరం మండలాలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న అంశములపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాసు గారు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.
సదరు సమావేశమునకు తణుకు & ఇరగవరం మండలాల డిప్యూటీ ఎంపీడీవో (PR), ఎస్. వి.వి. నరసింహమూర్తి, డిప్యుటీ ఎంపీడీఓ (SGSW) వి. వి. నారాయణ, అందరూ పంచాయతీ అభివృద్ధి అధికారులు, Nregs టెక్నీకల్ అసిస్టెంట్స్, Nregs EC, Nregs ఫీల్డ్ అసిస్టెంట్స్ మరియు మండల స్వర్ణ గ్రామ సిబ్బంది హాజరయ్యారు.



