నియోజకవర్గ వ్యాప్తంగా కదం తొక్కిన శ్రేణులు
10 క్లస్టర్ల పరిధిలో మహానాడు వీక్షించేందుకు ఏర్పాట్లు
ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తణుకు నియోజకవర్గంలో ప్రారంభమైన మహానాడు కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. వర్చువల్ విధానంలో తణుకు నియోజకవర్గంలో 10 క్లస్టర్ల పరిధిలో మహానాడు వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాల్లో సమీప గ్రామాల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయా గ్రామాల్లో కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాలులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్లు ద్వారా మహానాడు కార్యక్రమాలను వీక్షించారు. ముందుగా నియమించిన క్లస్టర్ ఇన్ చార్జీలు ఈ కార్యక్రమాలకు ఆధ్వర్యం వహించారు.



