మొంథా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కామల గ్రామంలోని అరటి తోటలను స్వయంగా పరిశీలించి రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితులను తెలుసుకుని, అధికారులకు ఎన్యుమరేషన్ జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. అనంతరం తుఫాన్ ధాటికి దెబ్బతిన్న ఇళ్లను, నేలకొరిగిన చెట్లను, స్తంభాలను పరిశీలించి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణమే వాటిని తొలగించేలా అధికారులకు సూచనలు అందించారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకూ అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో పెరవలి కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


