మొంథా తుఫాన్ ప్రభావం దృష్ట్యా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు రూరల్ మండలం శింగవరం గ్రామం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించిన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్.
అక్కడ తాత్కాలికంగా ఉంటున్న ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేసిన భోజన, నీటి, వైద్య సదుపాయాలను సమీక్షించారు.
అలాగే అదే కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రథమ చికిత్సా కేంద్రాన్ని పరిశీలించి మందుల నిల్వలు, వైద్య సిబ్బంది సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఎలాంటి లోటు ఉండకూడదని వైద్య అధికారులకు సూచనలు చేశారు.
మొంథా తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గేంత వరకూ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని, తుఫాన్ ప్రభావం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్లాలని మంత్రి దుర్గేష్ సూచించారు.


