ఉపకార వేతనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
చదువులో ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులకు విద్యానిధి ట్రస్ట్ ద్వారా ఉపకార వేతనాలు అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న దాతలను పూర్తిగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం వేల్పూరు గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చదువులో ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులకు ఉపకార వేతనాలను అందించిన ఎమ్మెల్యే అనంతరం మాట్లాడారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ద్వారా అండగా నిలుస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న విద్యానిధి ట్రస్టు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ట్రస్టు ద్వారా నిరంతరం ప్రతి ఏడాది ఉపకార వేతనాలు అందించే విధంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో మరింత మందికి అందించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెనుమర్తి వెంకటలక్ష్మి, ట్రస్ట్ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


