ఎన్.ఎస్.ఎస్. ఆవిర్భావ దినోత్సవం

జాతీయ సేవాపథకం ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక యస్.కె.యస్. మహిళా కళాశాల డిగ్రీ & పీజీ (అటానమస్) ఏర్పాటు చేసిన కార్యక్రమమునకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు.ఎల్. సుందరీబాయ్ మాట్లాడుతూ 1969 సం॥ము సెప్టెంబరు 24 తేదీ నుండి ప్రతీ సంవత్సరం ఎన్.ఎస్.ఎస్.డే గా జరుపుకుంటున్నామని, విద్యార్థులు సమాజ సేవలో పాల్గొనేలా ప్రోత్సహించడం దీని యొక్క ప్రధాన లక్ష్యమని, స్వచ్ఛభారత్, పరిసరాలను పరిశుభ్రం చేయడం, అక్షరాస్యత కార్యక్రమాలు, బాలిక విద్యా, మహిళా సాధికారత, మొక్కలు నాటడం మరియు వరదలు, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో వాలంటీర్లు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సేవల ఉద్ధేశ్యం విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీమతి కె.వి శ్యామలాదేవి, తెలుగు అధ్యాపకులు, పి. శివ ప్రసాద్, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, విద్యార్ధినులు, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link