ఇరగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కత్తవపాడు గ్రామము నందు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రవేశపెట్టిన స్వస్త్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంను కత్తవపాడు సర్పంచ్ మామిడి వరప్రసాద లక్ష్మి, సొసైటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు సమక్షంలో ప్రారంభించిరి . ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు వైద్యసేవలు అందించుటకు స్త్రీల వైద్య నిపుణులు, కంటిపరీక్షలు, స్త్రీలకు కేన్సర్ పరీక్షలు, కిశోర బాలికలకు రక్తపరీక్షలు, వృద్దులకు ఆరోగ్యపరీక్షలు, క్షయవ్యాది పరీక్షలు, సాదారణ అనారోగ్య రోగులను పరీక్షించి వైద్యులు ఈ కార్యక్రమంలో 110మంది రోగులకు వైద్యసేవలు అందించారు
ఈ కార్యక్రమంలో కత్తవపాడు గ్రామ నాయకులు, ఇరగవరం ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ యార్లగడ్డ మౌనిక,CHO Sk.ఖాన్ సాహెబ్, సూపర్వైసర్లు మూర్తి, మంగతాయారు, MLHP లు, ANM లు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ఇతర ఆరోగ్య సిబ్బంది సచివాలయం కార్యదర్శి వంగరాజు, సచివాలయ సిబ్బందిపాల్గొన్నారు .


