ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఎస్ ఆర్ టి సి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తులసి రామ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తణుకు డిపోలోని కాంట్రాక్ట్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తులసిరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీలోకాంట్రాక్టు కార్మికులు సుమారు 25వేల మంది పనిచేస్తున్నారని వారికి లేబర్ చట్టాలు అమలుకావడం లేదని అన్నారు. కార్మికులు సుమారు 44 రకాల పనులను వివిధ రూపాల్లో చేస్తారని అన్నారు. కార్మికులసమస్యలు పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలోజాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పటికే కొన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం చేసామని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు 2011 నుంచి కనీస వేతనాలు అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలని, అద్దె బస్సు కార్మికులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రకమైన జీతాలు అమలు చేయాలని, డ్రైవర్లకు ఐడెంటికార్డు ఇవ్వాలని, డ్రైవర్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎఫ్ఎస్డబ్ల్యుఎఫ్ యూనియన్ నాయకులు కే.నూకరాజు
ఎన్ శ్రీనివాసు, టీవీఎస్ మూర్తి, కే రామకృష్ణ ,ఆర్.బి.దుర్గారావు, కామన మునిస్వామి పాల్గొన్నారు.


