సీఎం చంద్రబాబుతో కలిసి నూతన దంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహవేడుకలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ బుధవారం పాల్గొని దంపతులను ఆశీర్వదించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులతో పాటు మంత్రి నారా లోకేష్ లను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అనంతరం వారితో కలిసి వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


