ఈ పండుగ ఆనందాల్ని మరింత పెంచుతూ కేంద్రం జీఎస్టీ స్లాబ్ లను తగ్గించడం శుభపరిణామని బిజేపి రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక అన్నారు. మంగళవారం తణుకు-పైడిపర్రు బాల వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఉత్సవకమిటీ సభ్యులు ఇండుగపల్లి బలరామకృష్ణ (మాజీ కౌన్సిలర్), కురసాల శ్రీనివాస్ (దేవస్థానం కమిటీ చైర్మన్), చినిమిల్లి సాంబశివరావు, మెండు సుబ్బారావు, కొమ్ముల సోమేశ్వరరావు, పేరుకుల రమేష్ , పంగం సుబ్రమణ్యం ఆహ్వానం మేరకు మండపమునకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న ముళ్ళపూడి రేణుక ఉత్సవకమిటి భవాని మాల వేసుకున్న 600 మందికి పైగా భవానీలకు అన్న ప్రసాదములు వడ్డించే కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ అమ్మవారి ఆశీస్సులతో విఘ్నాలు అన్ని తొలగిపోయి 2047 నాటికి ఈ దేశాన్ని ప్రపంచంలోనే వికసిత్ భారత్ గా మార్చే క్రమంలో ఆ భగవంతుడు మోదీ కీ మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. భారత దేశాన్ని ప్రపంచంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టాలని మోదీ గారు నిత్యం ప్రయత్నిన్నారు. ఈ దేశ కీర్తిని పెంచుతున్న మన ప్రధాని మోదీపై అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా అద్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, తణుకు పట్టణ బిజేపి అధ్యక్షులు బొల్లడ నాగరాజు, బిజేపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


