ఉండ్రాజవరం గ్రామంలో స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆర్.ఉషాదేవి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి పోషకాహారం తీసుకోవాలని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆశాజ్యోతి మాట్లాడుతూ ప్రజలు క్షయ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని మధుమేహం, బరువు తక్కువగా ఉన్నవారు 60 సంవత్సరాల పైబడిన వారు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు టీబీ పరీక్షలు చేయించుకోవాలని తెలియజేశారు, ప్రతి గ్రామము టీబీ రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని ఆశా కార్యకర్తలకు ఏఎన్ఎంలకు సూచించారు. అనంతరం క్షయవ్యాధి నివారణ మందులు వాడుతున్న రోగులకు పౌషకాహారం కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ మెండె వెంకట్రావు, ఎం .పి .హెచ్ .ఎస్. శ్రీరామ్ మూర్తి ,ఎమ్మెల్ హెచ్పి టీ. పూజ శ్రీ దుర్గా , ఏఎన్ఎం దుర్గా మల్లేశ్వరి, అంగన్వాడి టీచర్స్, వైద్య సిబ్బంది ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


