అత్తిలి మండలంలోని లక్ష్మీనారాయణ పురం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి నాగేశ్వరావు సహాయ వ్యవసాయ సంచాలకులు మాటేరు డివిజన్ ఎం వి రమేష్, అత్తిలి మండలం వ్యవసాయాధికారి రాజేష్ పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో మార్టేరు సహాయ వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ రైతులు అవసరమైనంత మేరకు మాత్రమే యూరియా వినియోగించాలని అతిగా యూరియా వినియోగించినట్లయితే చీడ పీడల బెడద పెరుగుతుందని దానివల్ల పురుగుమందుల ఖర్చు పెరిగి తద్వారా రైతుకు వచ్చే లాభం తగ్గుతుందని తెలియజేశారు అలాగే రైతులందరూ యూరియాకి ప్రత్యామ్నాయమైన నానో యూరియా వాడాలని సూచించారు అలాగే రైతులందరూ సామూహికంగా ఎలుకల నిర్మూలన చేయాలని సామూహికంగా చేసినట్లయితేనే ఎలుకలు ఉధృతి తగ్గుతుందని తెలియజేశారు అలాగే వ్యవసాయ శాఖ ద్వారా ఇచ్చే మందు ఒకసారి పెట్టిన తర్వాత మరల 10 రోజుల తర్వాత ఎలుకలు ఉధృతిని బట్టి మళ్ళీ రైతులు ఎలుకలు నిర్మూలన చేసినట్లయితే సమర్థవంతంగా ఎలుకలు నిర్మూలించవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు వి శ్రీనివాసచారి కూటమి నాయకులు రైతులు పాల్గొన్నారు


