ఆశ్వీయుజమాసం శరన్నవరాత్రి మహోత్సవముల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి దసరా మహోత్సవములలో భాగంగా రెండవ రోజు శ్రీ గాయత్రి అలంకారంలో ముత్యాలమ్మ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు భారీ ఎత్తున మహిళలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దసరా పురస్కరించుకొని ప్రత్యేక పూజలతో పాటు లలితా పారాయణ, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆలయ పాలకవర్గం తెలియజేశారు


