డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా తణుకు రామకృష్ణ సేవాసమితి వివేకానంద హ్యూమన్ ఎక్స్లెన్స్ సెంటర్ సంయుక్త నిర్వహణలో సజ్జాపురం రామకృష్ణ సేవాసమితిలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గౌరవ అధ్యక్షులు డాక్టర్ తాతిన రామబ్రహ్మం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తణుకు శాసనసభ్యులు ఆరీమిల్లి రాధాకృష్ణ విచ్చేసి ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అత్యున్నతమైనదని సర్వేపల్లి రాధాకృష్ణ ఆశయాలతో స్ఫూర్తితో ఉపాధ్యాయులు పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా జి. ఆంజనేయులు, జి .నాగమణి, డి. కృష్ణవేణి, మారుతీరామ్, జి. పద్మజారాణి తదితర ఉపాధ్యాయులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు బోగవల్లి శ్రీమన్నారాయణ, సెక్రటరీ చిలుకూరి రామకృష్ణ, మహిళా కోఆర్డినేటర్ చిలుకూరి సుజాత, తణుకు అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండేటి శివ, కే.గిరీశ్వర రావు, అక్కింశెట్టి రాంబాబు గోపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, రవీందర్ నాథ్, ఇందిరా నాగమణి, వర్మ, విజయలక్ష్మి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


