వినాయక చవితి మహోత్సవాలలో భాగంగా ఉండ్రాజవరం ఆర్యవైశ్య సేవా సంఘం భవనంలో నిర్వహించిన గణేష్ లడ్డు వేలం పాట. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాట కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొని జరిగిన వేలంపాటలో 12 కేజీల బరువు గల లడ్డూను రికార్డ్ స్థాయిలో 13,500 రూపాయలకు దక్కించుకున్న ఇమ్మడి గంగాధర్ కుటుంబ సభ్యులు. లడ్డు దాతలు గ్రంధి రాజా అండ్ బ్రదర్స్ వేలంలో పాడుకున్న లడ్డూను ఇమ్మడి గంగాధర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు గ్రంధి సత్య వెంకట గంగాధర్ (శ్రీను), జయవరపు శ్రీనివాస్, కొర్లపర సురేష్, శివ తదితరులు పాల్గొన్నారు.


