ముఖ్య అతిధి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్
విశాఖపట్నం: సెప్టెంబర్ 4 (కోస్టల్ న్యూస్)
వినాయక చవితి నవరాత్రి మహోత్సవములలో భాగంగా ఈరోజు 35, 36 వార్డులలో ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. 35వ వార్డ్ హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్ వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమం, రైతు బజార్ వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమం మరియు 36 వ వార్డు రంగ రీజు వీధి వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నదాన కౌంటర్లను ప్రారంభించి, భక్తులకు అన్నప్రసాదాన్ని కాసేపు వడ్డించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ మహా గణపతి ఆశీస్సులతో ఉత్సవాలు మరింత ఘనంగా జరగడానికి దేవుని యొక్క ఆశీస్సులు అందరి పైన ఉండాలని అన్నారు. కార్యక్రమంలో 35, 36 వార్డుల ఇంచార్జ్ లు లంకా. త్రినాధ్, బుచ్చా. రామిరెడ్డి మరియు కూటమి నేతలు, స్థానిక నిర్వాహకులు, అభిమానులు పాల్గొన్నారు.


