తణుకు జిల్లా హాస్పిటల్ లో ఎన్ సి డి సి డి 4.0 సర్వేలో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించిన శిక్షణ పిహెచ్సి ఎం.ఎల్ఎచ్.పి లకు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లలో శిక్షణ ఇవ్వడం జరిగినది. ఈ శిక్షణా కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ డా. కే.ఎం.ఆర్.కిషోర్, పి. ఓ.యూ నోడల్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి, జిల్లా ఎపిడెమోలాజిస్ట్ గాతల సుభాష్, డాక్టర్ మౌనిక, డా. భారతి , ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


