జనసేన సమస్యలు పరిష్కరించే పార్టీ

పెరవలి మండలం జనసేన నాయకులతో భేటీలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ

రాజమహేంద్రవరం: మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని పలు గ్రామాల జనసేన నాయకులతో రాజమహేంద్రవరంలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు. జనసేన సమస్యలు పరిష్కరించే పార్టీ అని తెలిపారు. ఈ సందర్భంగా స్వయంగా మంత్రి దుర్గేష్ తాను వెంట తెచ్చుకున్న పుస్తకంలో ప్రతి సమస్యను రాసుకొన్నారు. జనసేన పార్టీ ప్రతి ఒక్కరి క్షేమం గురించి ఆలోచిస్తుందని, ఎవరికి ఏ సమస్య ఉన్నా పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు.

Scroll to Top
Share via
Copy link