మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా సమిశ్రగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

సిబ్బంది కొరతపై మంత్రి కందుల దుర్గెష్ వారికి కేంద్రంలో స్టాఫ్ నర్సుల కొరత ఉందని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఆమేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించడం జరిగింది. తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె. వెంకటేశ్వర రావు మంత్రి కందుల దుర్గేష్ కి వివరణ ఇవ్వడం జరిగింది. విధి నిర్వహణ విషయంలో సిబ్బందికి సూచనలు చెయ్యడం జరిగిన నేపథ్యంలో
వైద్యాధికారి ఆధ్వర్యంలో పి హెచ్ సి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఇందులో సూపర్వైజర్లు, ANMలు, MLHPలు పాల్గొన్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, సమయానికి హాజరుకావాలని, బోనాఫైడ్ హెడ్‌క్వార్టర్‌లో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. విధుల పట్ల నిబద్ధతపై ప్రతిజ్ఞ కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా విధుల పట్ల నిబద్ధతతో పనిచేస్తామని సిబ్బంది వెల్లడించడమేకాక, అందుకు అనుగుణంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

మంత్రి వెంట వైద్య ఆరోగ్య అధికారి ఎస్ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link