తెలుగుదేశం పార్టీలో యువతకు ప్రోత్సాహం

నిస్వార్ధంగా పనిచేసే కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు

తాను కూడా కార్యకర్తలా పనిచేస్తానని వెల్లడి

ఇరగవరంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

ఇరగవరం మండలం టిడిపి నూతన కమిటీ ఏర్పాటు

తెలుగుదేశం పార్టీలో యువతను ప్రోత్సహించే విధంగా సీనియర్ నాయకులు చర్యలు తీసుకోవాలని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కోరారు. పార్టీలో ఎవరూ తక్కువ కాదని తాను కూడా ఒక కార్యకర్తలా పార్టీ పటిష్టత కోసం పనిచేస్తానని చెప్పారు. ఇరగవరం మండలం తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపు ఇచ్చిన ఇరగవరం నుంచి నాయకులు తమ ప్రాతినిధ్యం చూపిస్తారని అన్నారు. పార్టీ ఇచ్చే పిలుపుమేరకు నిస్వార్ధంగా నేనున్నానంటూ పనిచేసే కార్యకర్తలు నాయకులకు ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఇరగవరం మండలం అధ్యక్షుడు గూడూరి నాగరాజును ఆయన సేవలను ఎమ్మెల్యే రాధాకృష్ణ కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మండలంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడే విధంగా నాయకులు కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. మండలం అధ్యక్షుడిగా గూడూరి నాగరాజు కార్యదర్శిగా పోతిరెడ్డి శ్రీనివాసులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link