కూటమిని ఆదరించిన గ్రామాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత

గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యం

వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రణాళికలు

అత్తిలి టిడిపి సమావేశంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

గత సార్వత్రిక ఎన్నికల్లో అత్తిలి మండలంలోని పోలింగ్‌ బూత్‌లలో కూటమికి డబ్భై శాతం పైగా ఓట్లు పోలైన ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి అయినా సంక్షేమం అయినా ఖాళీ కాగితంపై రాసి ఇచ్చేలా అక్కడి ప్రజలకు హామీ ఇస్తున్నట్లు చెప్పారు. బుధవారం అత్తిలి మండలం తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల నియామకాల్లో భాగంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు. అత్తిలి నుంచి 2013లో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మండలంలోని కె.సముద్రపుగట్టు గ్రామం నుంచి పోరాటాలతో ప్రారంభమై ఆనాడు చేపట్టిన పాదయాత్రతో తనకు అత్తిలి మండలం ఎంతో అండగా నిలబడిందన్నారు. అత్తిలి మండలం తనకు ఎంతో సెంటిమెంటుగా వెన్నంటి ఉంటూ పాలనలో, పార్టీ కార్యక్రమాల్లో మండలం ప్రజలు అందిస్తున్న ఎంతో సహకరిస్తున్నారని అన్నారు. 2014 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించగా అత్తిలి మండలంలోనే 2019 ఎన్నికల్లో 50 వేల మెజార్టీ, 2024 ఎన్నికల్లో 17 వేల ఓట్లు మెజార్టీ సాధించామని చెప్పారు. దాదాపు 65 శాతం ఓట్లు అత్తిలి మండలంలో ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. వైఎస్సార్‌సీపీకు రాష్ట్రంలోనే 40 శాతం ఓట్లు రాగా తణుకు నియోజకవర్గంలోని 30 శాతం ఓట్లు పోలయ్యాయంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం అవుతుదని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీలు కలిసి అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఒక సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వ్యవస్థలను బ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కేంద్రంతో సమన్వయంతో చంద్రబాబునాయుడు వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎస్సీ, బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను గత ప్రభుత్వ హయాంలో పక్కదారి పట్టిస్తే చంద్రబాబునాయుడు వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో గ్రూపు తగాదాలు లేకుండా అందరినీ సమన్వయం చేసుకుంటూ నూతన కమిటీ నాయకత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ కోరారు. అత్తిలి మండల పార్టీ అధ్యక్షులుగా పోలిశెట్టి చందు, కార్యదర్శి అల్తి అజయ్‌కుమార్‌ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ పరిశీలకులుగా యర్రా వేణుగోపాల్‌నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తణుకు పట్టణంలోని 4, 20 వార్డుల కమిటీ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాలుగో వార్డు అధ్యక్షులుగా షేక్‌ ముజి, ఉపాధ్యక్షులుగా కంతేటి పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శిగా కాసాని కోటేశ్వరరావు, కోశాధికారిగా మల్లుల అంజలి, కార్యనిర్వాహక కార్యదర్శులుగా జాస్తి రామబ్రహ్మంచౌదరి, జక్కంశెట్టి కృష్ణారావు, కోటి మను ప్రకాష్, కార్యదర్శులుగా తమ్మిశెట్టి దుర్గాప్రసాద్, వనచర్ల మహాలక్ష్మి, నేకూరి కృష్ణ ఎన్నిక కాగా 20వ వార్డు అధ్యక్షులుగా దేరా రాజకుమార్, ఉపాధ్యక్షులుగా జక్కంశెట్టి దాననరేంద్రరావు, ప్రధాన కార్యదర్శిగా విత్తనాల సాయి, కోశాధికారిగా జడ్డు వెంకటరమణ, కార్యనిర్వాహక కార్యదర్శులుగా షణ్ముఖి రామకుమార్‌రాజు, గమిని సుష్మంత్‌కుమార్, బేగం హుస్సారం, కార్యదర్శులుగా కాకరపర్తి శ్రీనివాస్, తుమ్మల సత్యశ్రీనివాస్, ముల్లె వెంకటవిజయ్‌కుమార్‌ తదితరులు ఎన్నికయ్యారు.

Scroll to Top
Share via
Copy link