29వ వార్డ్ ప్రకాశంపేట బంగారమ్మ తల్లి అమ్మవారి ఉత్సవం

29వ వార్డ్ ప్రకాశంపేట గ్రామ దేవత అయిన శ్రీశ్రీశ్రీ బంగారమ్మ తల్లి అమ్మవారి ఉత్సవం ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు ప్రకాష్ రావు పేట గ్రామ సభ్యుల ఆహ్వానం మేరకు ప్రకాష్ రావు పేట గ్రామదేవత అయిన శ్రీశ్రీశ్రీ బంగారమ్మ తల్లి ఉత్సవాల్లో పాల్గొని విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన 29వ వార్డు జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ ప్రకాష్ రావు పేట గ్రామ సభ్యులందరూ కూడా జనసేన సీనియర్ నాయకులు మన్యాల శ్రీనివాస్ కి స్వాగతం పలికి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మన్యాల శ్రీనివాస్ కి దుస్సాలువ తో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి చల్లని దయ మన్యాల శ్రీనివాస్ పై మరియు వారి కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉంటుందని తాము ఏ కార్యక్రమం చేపట్టిన కాదనకుండా తన వంతు సహాయ సహకారాలు అందించడంలో మన్యాల శ్రీనివాస్ ఎల్లప్పుడూ ముందుంటారని తెలిపారు.ఈ సందర్భంగా మన్యాల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకాశరావుపేట గ్రామదేవత అయిన శ్రీశ్రీశ్రీ బంగారమ్మ అమ్మవారి ఆశీస్సులు భక్తకోటి జనులందరి పైన ఎల్లప్పుడూ ఉండాలని ఉంటుంది అని ఆకాంక్షించి ప్రకాష్ రావు పేట గ్రామస్తులు ఎంతో అట్టహసంగా జరుపుతున్న ఉత్సవాలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని గ్రామంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టిన తన ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని మన్యాల శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ రావు పేట గ్రామ సభ్యులు, సంఘ సభ్యులు మరియు మన్యాల శ్రీనివాస్ టీం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link