ఆంధ్రప్రదేశ్లో బిజెపి పార్టీ నుండి రెండవసారి శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు,
ఆంధ్రప్రదేశ్ పూర్వ అధ్యక్షులు
సోము వీర్రాజు ఆత్మీయ అభినందన సభ మంగళవారం రాజమండ్రి మంజీరా ఫంక్షన్ హాల్ యందు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి నాయకులు తణుకు పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్, ఏపీ రేరా మాజీ సభ్యురాలు డా.ముళ్ళపూడి రేణుక పాల్గొని సోము వీర్రాజుకు శుభాభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎంతో నిబద్ధతతో పార్టీ కార్యక్రమాల నిర్వహణ చేస్తారని, వారి సేవలు బిజేపి పార్టీ అభివృద్దికి మరింత చేయూతనిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, సుజనా చౌదరి, పశ్చిమగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఉభయగోదావరి జిల్లాల నుండి బిజెపి నాయకులు బొల్లిన నిర్మల, నార్ని తాతాజీ, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


