యువత ఉజ్వల భవిష్యత్తుపై అవగాహన సదస్సు

స్థానిక ఎస్ కే ఎస్ డి విద్యాసంస్థలు ఏర్పాటు చేసిన యువత ఉజ్వల భవిష్యత్తుపై అవగాహన సదస్సు గురువారం కళాశాల ప్రాంగణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి లోక్సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు అడిగిన సందేహాలకు సమాధానం చెబుతూ నాయకులను ప్రజలు పెద్ద ఎత్తున ఎన్నుకున్నప్పటికీ నిస్వార్ధమైన సేవకు అందుబాటులో లేరని అన్నారు. నిజాయితీ సమర్థత నిస్వార్ధం ఈ మూడు నాయకులలో ఉన్నప్పుడే మంచి పరిపాలన వస్తుందని అన్నారు అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే నాయకులను ప్రజలు ప్రశ్నించగలరని చట్టం ద్వారా సమానం న్యాయం, పొందగలమని తెలియజేశారు. చట్టబద్ధ పాలన ప్రశ్నించే అధికారం ఉన్నప్పటికీ ప్రజలలో చైతన్యం లేనప్పుడు సమాజం ముందుకు వెళ్లలేదని అన్నారు ప్రజలకు ప్రభుత్వ చట్టాలు సేవలు వినియోగించుకునే అధికారం చైతన్యం ప్రజలకు రావాలి, కుల మత వర్ణరహిత నాయకులతో వ్యవస్థ ఏర్పడాలి అని గతంతో పోలిస్తే వర్తమానం కొంచెం ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఇంకా మార్పు రావాల్సి ఉందని అన్నారు. ప్రపంచంలో అతి తక్కువ కాలంలో అందరికీ ఓటు హక్కు కల్పించిన దేశం భారతదేశం మాత్రమే అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య సంస్కరణలు రావాలని వ్యవస్థాగత మార్పులు ముఖ్యంగా యువతలో చైతన్యం రావాలని అన్నారు. సమస్యల లోతుపాతులను విశ్లేషించి పరిష్కారం చేయాలని అవినీతి నిర్మూలనకు మనమందరం కలిసికట్టుగా పోరాడాలని ఉత్పత్తి ఉత్పాదకత పెరిగితే యువతకు ఉపాధి ఏర్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీమతి చిట్టూరి సత్య ఉషారాణి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి లెఫ్ట్నెంట్ యు. లక్ష్మీ సుందరి భాయ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి సిహెచ్. హిమబిందు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినిలు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం డాక్టర్ జయప్రకాష్ నారాయణ ను ఘనంగా సత్కరించారు

Scroll to Top
Share via
Copy link