ప్రైయివేట్, కార్పొరేట్ విద్యాసంస్థల పిచ్చలవిడి ఫీజుల దోపిడీపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుని విద్యా వ్యాపారాన్ని నియంత్రించి , ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ.ఐ.యస్.ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా తణుకులో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐసా కళాశాల జనరల్ బాడీ సమావేశం ఎం.ఆకాశ్ అధ్యక్షతన జరిగింది. ఫీజుల నియంత్రణ , విద్యా వ్యాపారంపై రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఇదే క్రమంలో ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐసా పట్టణ అధ్యక్షుడు ఎం మనోజ్, వి జెర్సీ , కే. వంశి, వి.తేజ తదితరులు పాల్గొన్నారు.



