బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం పై కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్

బహిరంగ ప్రాంతాలలో మద్యపానంకి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బహిరంగ మద్యపానం పై దాడులను విస్తృతం చేయడం జరిగింది. దీనిలో భాగంగా సోమవారం తణుకు మండలం పైడిపర్రు మరియు మండపాకలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారిపై కేసులను నమోదు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ దాడులు కొనసాగుతాయని, బహిరంగ ప్రదేశాలలో మద్యపానం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తణుకు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు.

Scroll to Top
Share via
Copy link