క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం పంపిణీ.

ఉండ్రాజవరం: క్షయ రహిత సమాజమే ధ్యేయంగా దాతలు ముందుకొచ్చి, పలువురికి ప్రేరణ కల్పించాలని టీ.బీ. వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్ అందించిన దాత, జర్నలిస్ట్ వెంకట సత్యసాయి బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం, ఉండ్రాజవరం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో టీ.బీ. ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా దాతల సహకారంతో టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహారం కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ దుర్గా మహేశ్వరరావు మాట్లాడుతూ క్షయ రోగులందరూ క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. టీబీ ట్రీట్మెంట్ యూనిట్ సూపర్వైజర్ వి.ఆశాజ్యోతి మాట్లాడుతూ
క్షయరోగులను దత్తత తీసుకొని, పోషకాహార కిట్లు అందించిన దాతను అభినందించారు. ఉండ్రాజవరం మండలంలో దాతలు ముందుకు వచ్చి టీ.బీ. ఫ్రీ ఇండియా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఏఎస్ శ్రీరామ్ మూర్తి, ఎం ఎల్ హెచ్ పి పూజ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link