చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు… అఖిల పక్షరౌండ్ టేబుల్ సమావేశంలో ప్రభుత్వంపై కారుమూరి విమర్శలు

తణుకు నియోజకవర్గంలోని పద్మశ్రీ ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి డాక్టర్ కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండేళ్ల ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తూ ప్రత్యేక బ్యానర్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు.

సమావేశంలో మాట్లాడిన కారుమూరి నాగేశ్వరరావు, అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు వాటిని అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచారని విమర్శించారు. భూ హక్కుల పరిరక్షణ, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో పారదర్శకత కోసం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చర్యలను తప్పుదోవ పట్టిస్తూ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారని ఆరోపించారు. అలాగే టీడీఆర్‌లు, మద్యం విధానం, పేకాట క్లబ్బులు, క్రికెట్ బెట్టింగ్‌ల అంశాలపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతు సంక్షేమం, నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, గ్రామ సచివాలయాల ఏర్పాటు వంటి పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి అమలు చేయకుండా నిరాశపరిచారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎవరూ నిర్లక్ష్యంగా తీసుకోవద్దని, ప్రతి ఓటరు తమ పేరు జాబితాలో ఉందో లేదో తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని సూచించారు.ఓటరు జాబితాలో మన ఓట్లు ఉన్నాయో లేదో పక్కాగా చూసుకోవాలని నియోజకవర్గం నుంచి వేరే ప్రాంతాలకు పనుల నిమిత్తం వెళ్ళిన వారి ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఓటరు జాబితా విషయంలో జిత్తులమారి చంద్రబాబు తో జాగ్రత్త అవసరం అని అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశ ప్రాంగణంలో చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాలనపై విమర్శాత్మక బ్యానర్ ప్రదర్శన ఏర్పాటు చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

Scroll to Top
Share via
Copy link